శ్రీసర్వేశ్వరవర తనయూడు - తేజస్కామూడు |
సిద్ధి బుద్ధి నాయుకుడు - ఆశ్రితవరదూడు |
గజముఖధరుడూ - గణనాయుకుడు |
మూషిక వాహన - మోదకహస్తుడు
గ్రహం గణపతి రక్షించు యీ దంపతులనూ ||
హంసవాహనుడు అబ్జాసనుడూ - నారాయుణ సుతుడూ|
పానీతలమున వీణా కలిగిన - వాణీ విభుడు |
వేద జనకుడు వేదాతీతుడు - వేదాంత చారపరుడూ |
బ్రహ్మ దేవుడు రక్షించు యీ దంపతులనూ ||
లక్షీసహితుడు నిక్షేపాజ్ఞుడు - పక్షివాహనుడు |
పాతక సంహారుడు - పీతాంబరధరుడూ |
అహల్య శాప మోచనుండు - అక్షయుమొసగిన ఆది దేవుడు |
శ్రీమహాష్ణువు - రక్షించు యీ దంపతులనూ ||
పార్వతి సహితుడు - పన్నగధరుడు - ఫాలనేత్రుడు |
గౌరీహితుడు - గంగాధరుడు - గజచర్మాంబరధరుడూ |
కరిముఖజనకుడు - గరళగ్రీవుడు - కైలాసాద్రినివాసుండైన |
సాంబ మూర్తి రక్షించు - ఈ దంపతులనూ ||
రక్తవస్తువు ప్రీతికరుడు - రత్నాంబరధరుడూ |
రక్తగాత్రుడు - బూగ్వేదుడూ - వేదాచార్యుడు |
పదిమూడారింట, ఫలదాయుకుడూ - పంచమరాశిన నివసించెడువాడు|
సూర్యగ్రహము రక్షించు - యీ దంపతూలనూ ||
తెల్లనిగంధము - తెల్లనిమేను - తేజస్కామూడు |
రోహిణి హితుడు - రాత్రీశ్వరుడూ - రూఢిగ ఇతడూ |
ఆరు, ఒకటి, మూడెడింటను ఎప్పటికిని ఫలదాయుకుడైనా |
చంద్రగ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
అప్రకాశూడు ఆదిత్యోత్తము - డత్యంతోత్తముడు |
మేషవృశ్చిక రాసుల యుందు కాంక్ష గలవాడు |
ఆడకధాన్య ఆహారపరుడు - అగ్నిహోత్రునకు అనుకూలుండు |
అంగారకగ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
సోముని సుతుడు మేషాతీతుడు - మేధాతీతూడూ |
కన్య ధున రాసులయుందు కాంక్ష గలవాడు |
ఎనిమిది నాలుగు పది రెండింటను - ఎప్పటికిని ఫలదాయుకుడైనా |
బుధగ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
ధునధనుస్సులాకారముగా - మేదిని లోపలను |
తొ్మ్మ్దిది రెండెడింటను తొలుతగా ఫలుచ్చు |
బుగ్వేదాత్తుడు - లోకాతీతుడు - ప్రీతిదై్వత ప్రీతి కరుడూ |
గురుగ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
వృషతుల రాశుల యీరెండింటని - వరించెడువాడు |
భార్గవసుతుడు దానవ హితుడు - ప్రఖ్యాతైనవాడు |
ఆరు ఒకటి మూడేడింటను - ధనము నొసగెడి - ధవళ శరీరుడు |
శుక్ర గ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
మంద గమనుడు - మలిన శరీరుడు - మలినాంబరధరుడూ |
ఆరు - మూడింటను - అనుకూలుండు - ఆయూశ్కారకుదు |
కుంభమృగాదులు కోరిన విభుడూ -ఛాయూధరడూ ఛాయూ సుతుడు
శని గ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
కృష్ణవర్ణుడు - కృష్ణశరీరుడు - కృష్ణాంబరధరుడూ |
సృష్టీపరుడూ - నిష్టాపరుడూ - శ్రేష్టుండవు నీవు |
మాషాశనుడవు - మన్మధ మిత్రుడవు |
మూడారింటను - ముఖ్యుడవైనా |
రాహుగ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
చిత్రవర్ణుడు - చిత్రశరీరుడు - చిత్రాంబరధరుడూ |
చిత్రాగుప్తాదుల తోటి - మైత్రీగలవాడు |
త్రిషడస్థానందు శివుడూ వృషళీ పతుడూ కుళుధ్వజుడు |
కేతుగ్రహము రక్షించు - యీ దంపతులనూ ||
ఆశించెవ్వరు నవగ్రహాల - మంగళహారాతీ
పాడీ న్నను - కాశీయూత్రా చేసిన ఫలమూ
వాసిగ వారణాశి సుబ్బయు్యశాస్త్రి - శాశ్వత వరద నివాసుండైనా
శ్రీసర్వేశ్వరవర సన్నిధికి - చేరుదు మెల్లపుడూ ||